హిజబ్ వివాదంలో పాకిస్తాన్ తలదూర్చింది. భారత్‌కు హితవచనాలు చెప్పింది. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాక్‌కు కౌంటర్ ఇచ్చారు. బాలికల విద్యపై భారత్‌కు పాకిస్తాన్ పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘మీ పని మీరు చూసుకోండి. భారత్ విషయాల్లో తలదూర్చకండి’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. మలాలాను కాపాడలేని దేశం… బాలిక విద్యపై భారత్‌కు హితవచనాలు చేయడమేంటని తీవ్రంగా విరుచుకుపడ్డారు. బాలికల విద్యపై భారత్‌కు పాకిస్తాన్ పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదు. అక్కడే మలాల వుంది. పాక్‌లోని బాలికలకు సరైన రక్షణను కల్పించడంలో విఫలమైన పాక్.. ఇప్పుడు భారత్‌కు పాఠాలు నేర్పుతోంది.
పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ ఏమన్నారంటే…
పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. హిజబ్ ధరించిన కారణంగా మహిళలను విద్య నుంచి దూరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, ఇది మానవహక్కులను హరించడమే అవుతుందని పాక్ విదేశాంగ మంత్రి ట్వీట్ చేశారు. ‘ముస్లిం పిల్లలను చదువు సంధ్యల నుంచి దూరం చేయడం అంటే.. మావన హక్కులను హరించడమే. ఓ వ్యక్తి ప్రాథమిక హక్కులను హరించడం సరైన విధానం కాదు. హిజబ్ ధరించిన వారిని భయభ్రాంతులకు గురి చేయడం అంటే అణచివేయడమే. ఇలా చేయడం ద్వారా ముస్లింలను గుప్పిట్లో పెట్టుకోవాలని భారత ప్రభుత్వం చూస్తోంది’ అంటూ పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ ట్వీట్ చేశారు.