Tomato | కర్ణాటకలో రూ. 2.5 లక్షల విలువ చేసే టమాటా చోరీ.. కేసు నమోదు
Tomato | బెంగళూరు : దేశ వ్యాప్తంగా టమాటా రేట్లు భగభగ మండిపోతున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఉంది. కిలో టమాటా ధర రూ. 120 నుంచి రూ. 180 దాకా పలుకుతోంది.
Tomato | బెంగళూరు : దేశ వ్యాప్తంగా టమాటా రేట్లు భగభగ మండిపోతున్న సంగతి తెలిసిందే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు ఉంది. కిలో టమాటా ధర రూ. 120 నుంచి రూ. 180 దాకా పలుకుతోంది. ఈ నేపథ్యంలో టమాటా పండించే రైతులు తమ పంటలకు పటిష్టమైన పహారా ఏర్పాటు చేసుకున్నారు. అయినప్పటికీ దొంగలు మాత్రం దోచుకుంటున్నారు. కర్ణాటకలో రూ. 2.5 లక్షల విలువ చేసే టమాటాను దొంగలు చోరీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. హసన్ జిల్లా పరిధిలోని గోని సోమనహళ్లి గ్రామానికి చెందిన మహిళా రైతు ధరణి.. తనకున్న రెండు ఎకరాల పొలంలో టమాటా పంటను వేసింది. కాపు కూడా బాగా కాసింది. ప్రస్తుతం కర్ణాటకలో కిలో టమాటా ధర రూ. 120 పైనే పలుకుతోంది. దీంతో తమకు కాసుల వర్షం కురిసినట్టే అనుకుని ధరణి భావించింది. రేపోమాపో టమాటాను తెంచి, బెంగళూరుకు తరలించాలని ఆమె ప్లాన్ చేసుకుంది. కానీ మంగళవారం రాత్రే టమాటా తోటలో దొంగలు పడ్డారు. 50 నుంచి 60 బ్యాగుల టమాటాను దొంగిలించారు. ఈ టమాటా విలువ రూ. 2.5 లక్షలు ఉంటుందని మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది. మిగతా పంటను నాశనం చేశారని ఆమె తెలిపింది. బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

