
ముంబై: బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి డ్రగ్స్ కేసులో బెయిల్ లభించడంపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తనదైన శైలిలో స్పందించారు. ‘సినిమా ఇంకా పూర్తి కాలేదు మిత్రమా’.. అంటూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు చురక అంటించారు. ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అరెస్ట్ చేయడాన్ని తొలి నుంచి ఖండించిన ఆయన తన అల్లుడ్ని కూడా అరెస్ట్ చేసిన కేంద్ర సంస్థ ఎన్సీబీ లోగుట్టును ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు.
ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌లో కీలకంగా వ్యవహరించిన ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేపై ఎన్సీపీ మంత్రి నవాబ్ మాలిక్ పలు ఆరోపణలు చేశారు. ఆ అధికారి దోపిడీలు, ఫోర్జరీకి పాల్పడ్డారని విమర్శించారు. దీనిని ఆధారాలతో సహా నిరూపించి సమీర్‌ను జైలుకు పంపుతానని కూడా ఇటీవల ఆయన హెచ్చరించారు.
पिक्चर अभी बाकी है मेरे दोस्त
— Nawab Malik نواب ملک नवाब मलिक (@nawabmalikncp) October 28, 2021