బెంగళూరు, సెప్టెంబర్ 7: బెంగళూరులో వరద విలయంపై కర్ణాటక సర్కారు మీద ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్ విమర్శలు గుప్పించారు. రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు కలిసి ప్రజలను వరదల్లో ముంచారని మండిపడ్డారు. అసమర్థ ప్రభుత్వం, అధ్వాన్న పాలన, అడ్డగోలు అవినీతి.. వీటి ఫలితంగానే బెంగళూరు నేడు వరదల్లో మునిగిందని పేర్కొన్నారు. నిధులు కేటాయిస్తున్నా భారీ అవినీతి కారణంగా పనులు సరిగా జరుగట్లేదని విమర్శించారు. అక్రమ నిర్మాణాలు, కార్పొరేషన్ అసమర్థత.. ఇలా చెప్పుకుంటూ పోతే కారణాలు అనేకం ఉన్నాయన్నారు. గత 30 ఏండ్లుగా మన నగరాల్లో సంస్కరణలు చేపట్టకపోవడాన్ని బెంగళూరు వరదలు ఎత్తిచూపుతున్నాయని పేర్కొన్నారు.