Aryan Shukla | ముంబై : మహారాష్ట్రకు చెందిన ఆర్యన్ శుక్లా (14) ఒక రోజులో ఆరు గిన్నిస్ రికార్డులను సృష్టించాడు. ఐదు అంకెలు గల 50 సంఖ్యలను 25.19 సెకండ్లలో కూడిక చేసి రికార్డు సృష్టించాడు.
నాలుగు అంకెలు గల 100 సంఖ్యలను అత్యంత వేగంగా 30.9 సెకండ్లలో కూడిక చేయడం, నాలుగు అంకెలు గల 200 సంఖ్యలను 1 నిమిషం 9.68 సెకండ్లలో కూడిక చేయడం, 20 అంకెలు గల సంఖ్య ను 10 అంకెలు గల సంఖ్య చేత అత్యంత వేగంగా, అంటే, 5 నిమిషాల 42 సెకండ్లలో భాగించడం, 2 ఐదు అంకెలు గల సంఖ్యల 10 సెట్స్‌ను అత్యంత వేగంగా, 51.69 సెకండ్లలో, గుణించడం, 2 ఎనిమిది అంకెల సంఖ్యల 10 సెట్స్‌ను అత్యంత వేగంగా 2 నిమిషాల 35.41 సెకండ్లలో గుణించడం, నాలుగు అంకెల 100 సంఖ్యలను 30.9 సెకండ్లలో కూడిక చేశాడు.