Arvind Kejriwal | రాయ్పూర్: దేశం పేరు మార్పును తీవ్రంగా ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఆయన విరుచుకుపడ్డారు. ఛత్తీస్గఢ్లో శనివారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.
‘భారతదేశం 140 కోట్ల ప్రజలది. ఇండియా మా గుండెల్లో ఉంది. భారత్ మా గుండెల్లో ఉంది. హిందూస్థాన్ మా గుండెల్లో ఉంది. దేశం పేరును ఎలా మారుస్తారో చూస్తాను. దేశం ఏమైనా మీ తండ్రికి చెందిన ఆస్తా? దేశం పేరు మార్చడానికి మీరెవరూ’ అంటూ బీజేపీపై విరుచుకుపడ్డారు.