చండీగఢ్, సెప్టెంబర్ 3: ఒకే దేశం-ఒకే ఎన్నిక ఆలోచన వెనుక హేతుబద్ధత ఏమిటి? సామాన్యుడికి దీనివల్ల ఒరిగేదేమిటో తెలియడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రం వైఖరిని దుయ్యబట్టారు. ‘అసలు ఈ దేశానికి ఏది ముఖ్యం? ఒకే దేశం-ఒకే ఎన్నిక లేక ఒకే దేశం-ఒకే విద్య (బీదా గొప్ప తారతమ్యం లేకుండా అందరికీ సమానంగా విద్య), ఒకే దేశం-ఒకే వైద్యం (పేద, గొప్ప తేడా లేకుండా అందరికీ సమాన వైద్యం) కావాలా? అసలు సామాన్యుడు ఈ ఒకే దేశం-ఒకే ఎన్నిక ద్వారా ఏం లబ్ధి పొందుతాడు? జమిలితో అతనికి ఒరిగేదేమిటి?’ అని ప్రశ్నిస్తూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ‘వన్ నేషన్.. వన్ ఫ్రెండ్’ స్కీమ్‌పై దృష్టిసారించిందని దుయ్యబట్టారు. అదానీ గ్రూప్‌నకు కాంట్రాక్ట్ కోసమే గ్రీస్‌లో ప్రధాని మోదీ ఇటీవల పర్యటించారని ఆయన ఆరోపించారు.