న్యూఢిల్లీ, నవంబర్ 18: ఢిల్లీ ప్రభుత్వ దవాఖాన టెండర్ స్కామ్‌లో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌ను వెంటనే తొలగించడమో, సస్పెన్షనో చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ఎల్జీకి దానికి సంబంధించిన నివేదికను పంపారు. ఒక ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ కోసం ప్రభుత్వానికి చెందిన ఐఎల్‌బీఎస్ దవాఖాన నుంచి సీఎస్ నరేష్ కుమార్ కుమారుడు కరణ్ చౌహాన్‌కు చెందిన మెటామిక్స్ కంపెనీ ఎలాంటి టెండర్ లేకండానే భారీ కాంట్రాక్టు పొందిందని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఆ దవాఖానకు చైర్మన్‌గా ఉన్న నరేష్ కుమార్ ఎలాంటి టెండర్ పిలవకుండా తన కుమారుడికి ఆ పనిని కట్టబెట్టడంతో వంద కోట్ల అక్రమాలు జరిగాయన్నారు. కాగా, ఈ ఆరోపణలను ఐఎల్‌బీఎస్ దవాఖాన ఉన్నతాధికారులు కొట్టి పారేశారు. తాము ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీకి, నరేష్ కుమార్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.