Arvind Kejriwal | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly polls) దగ్గరపడుతుండటంతో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) దూకుడు పెంచింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అనేక హామీలు ప్రకటిస్తోంది. ఇప్పటికే ఆటో డ్రైవర్లకు ఐదు కీలక హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మహిళలకు (Delhi women) ఆమ్ ఆద్మీ పార్టీ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఎన్నికల్లో ఆప్‌ను గెలిపిస్తే 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకూ నెలకు రూ.2,100 అందజేస్తామని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు.
గురువారం సీఎం అతిశీతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ప్రతి మహిళకు రూ.1,000 ఇస్తామని గతంలో హామీ ఇచ్చాము. అయితే, కొంతమంది మహిళలు నా వద్దకు వచ్చి ద్రవ్యోల్బణం కారణంగా రూ.1,000 సరిపోవడం లేదని చెప్పారు. అందుకే వారి అభ్యర్థన మేరకు 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ నెలకు రూ.2,100 ఇస్తాం’ అని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలోకే ఈ మొత్తా్న్ని జమ చేయనున్నుట్లు వెల్లడించారు.
Also Read..
Nayanthara | ధనుష్‌తో వివాదం.. నయనతారకు మద్రాసు హైకోర్టు నోటీసులు
Delhi | మొన్నటి వరకూ తీవ్ర కాలుష్యం.. ఇప్పుడు చలి.. ఢిల్లీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
Elon Musk | చరిత్ర సృష్టించిన మస్క్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా రికార్డు