Arundhati Roy | న్యూఢిల్లీ: ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్‌తో పాటు, కశ్మీర్‌కు చెందిన మాజీ ప్రొఫెసర్లను చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద ప్రాసిక్యూట్ చేయడానికి ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతి ఇచ్చారు. 2010లో దేశ రాజధానిలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై ఆరుంధతీ రాయ్‌ను, మాజీ ప్రొఫెసర్ షేక్ షౌకత్ హుస్సేన్‌ను ఉపా కింద విచారణ జరిపించడానికి గవర్నర్ అనుమతించినట్టు రాజ్ నివాస్ అధికారులు శుక్రవారం తెలిపారు.
కాగా, న్యూఢిల్లీ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాల ప్రకారం అరుంధతీ రాయ్‌తో పాటు కశ్మీర్ ప్రొఫెసర్ షేక్ షౌకత్‌లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై రాయ్, షౌకత్ ఇంకా స్పందించ లేదు. భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చేసే అంశాలపై ‘ఢిల్లీలో ఆజాది-ద ఓన్లీ వే’ పేరిట 2010 అక్టోబర్ 21న జరిగిన సమావేశంలో చర్చలు జరిగాయి. అందులో పార్లమెంట్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడైన సార్ గిలానీతో పాటు అరుంధతీ రాయ్ తదితరులు దేశ సమగ్రతను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్టు ప్రధాన ఆరోపణ.