ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh)లో అంతర్ రాష్ట్ర వ్యభిచార ముఠా నిర్వహిస్తున్న కేసులో 21 మందిని అరెస్టు చేశారు. దాంట్లో ఓ ప్రభుత్వ అధికారి ఉన్నారు. 10 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న అయిదుగురు బాలికలను కూడా రక్షించారు. అరెస్టు అయిన ప్రభుత్వ అధికారులను డీఎస్పీతో పాటు హెల్త్ సర్వీసెస్ డిప్యూటీ డైరెక్టర్‌గా గుర్తించారు. అస్సాంలోని ధీమాజి నుంచి మైనర్ అమ్మాయిలను తీసుకువచ్చినట్లు ఇద్దరు మహిళలపై ఆరోపణలు ఉన్నాయి. ఆ మహిళలు ఇటానగర్‌లో బ్యూటీ పార్లర్ నడుపుతున్నారని ఎస్పీ రోహిత్ రజ్బీర్ సింగ్ తెలిపారు. చింపూలో మైనర్ల తోటి వ్యభిచార ముఠాను నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉన్నది. అయితే ఆ ఇద్దరు మహిళలకు చెందిన నివాసాలపై పోలీసు బృందాలు దాడి చేశాయి. ఇద్దరు అమ్మాయిలను రెస్క్యూ చేశారు. వ్యభిచార రాకెట్లో పాల్గొన్న పది మందితో పాటు 11 మంది కస్టమర్లు, అయిదుగరు ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేసినట్లు సింగ్ తెలిపారు.