న్యూఢిల్లీ: స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ) దళానికి సుదీర్ఘకాలం నుంచి డైరెక్టర్(SPG Director)గా ఉన్న అరుణ్ కుమార్ సిన్హా ఇవాళ కన్నుమూశారు. ఆయన వయసు 61 ఏళ్లు. గత కొన్నాళ్ల నుంచి ఆయన ఆరోగ్యం సరిగాలేదు. గురుగ్రామ్‌లోని ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అరుణ్ కుమార్‌ది 1987 బ్యాచ్. కేరళ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్. 2016 నుంచి ఆయన ఎస్పీజీ డైరెక్టర్‌గా చేస్తున్నారు.
ఇటీవలే ఆయన ఆ పోస్టుకు పదవీకాలాన్ని పొందారు. ప్రధానితో పాటు మాజీ ప్రధానులు, వారి కుటుంబసభ్యులకు భద్రత కల్పించే ఉద్దేశంతో 1985లో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపును స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.అయితే ఆ రూల్‌ను ప్రస్తుతం మార్చేశారు. కేవలం ఇప్పుడు ప్రధానిగా ఉన్నవారికి మాత్రమే రక్షణ కల్పిస్తున్నారు. గతంలో తిరువనంతపురంలో అరుణ్ కుమార్ సిన్హా.. డీసీపీ కమీషనర్, రేంజ్ ఐజీ, ఇంటెలిజెన్స్ ఐజీ, అడ్మినిస్ట్రేషన్ ఐజీగా చేశారు.