Viral Video | లాట్ ఆర్ట్ అంటే ఎంతో సహనం, నేర్పు, సృజనాత్మకత అవసరం. వినూత్న లాట్ ఆర్ట్ వర్క్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తుంటాయి. ఇటీవల ఓ యూనిక్ లాట్ ఆర్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. సాధారణంగా కప్ లేదా మగ్ను ఈ ఆర్ట్‌కు ఎంచుకుంటారు.
అయితే ఆర్టిస్ట్ ఏకంగా పానీపూరిలో తన కళను ప్రదర్శించారు. అనిష్రాయ్19801 అనే యూజర్ ఇన్స్టాగ్రాం రీల్లో ఈ ఆర్ట్‌ను ప్రదర్శించారు. కాఫీ లిక్విడ్‌తో కూడిన చిన్న రౌండ్ పానీ పూరి ఈ వీడియోలో కనిపిస్తుంది. లాట్ ఆర్టిస్ట్ పూరి పైభాగంలో పాలతో ఆకట్టుకునే డిజైన్ రూపొందిస్తారు.
ఈ రీల్‌ను ఇప్పటివరకూ ఏకంగా 4.6 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ క్రియేషన్‌కు నెటిజన్లు కపురిసినో, లాట్పూరి, గప్పెచినో, కాఫీపూరి, పూరిచినో అని పలురకాల పేర్లను రాసుకొచ్చారు. మరికొందరు ఈ ప్రీమియం పూరి మెనూలో ఉంటే అధిక ధర ఛార్జ్ చేస్తారేమో అని కామెంట్ చేశారు.
Read More :