జైసల్మేర్: సైనిక విన్యాసాల్లో భాగంగా రాజస్థాన్లోని జైసల్మేర్లో ప్రయోగించిన ఒక క్షిపణి గురి తప్పి బదరియా అనే గ్రామంలో నివాసిత ప్రాంతానికి 500 మీటర్ల దూరంలో పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెద్దపేలుడు సంభవించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
శనివారం సాయంత్రం నాలుగు గంటలకు రోజువారీ విన్యాసాల్లో భాగంగా పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజిలో ఇండియన్ ఎయిర్ఫోర్స్ ప్రయోగించిన క్షిపణి గురితప్పి గ్రామానికి సమీపంలో పడింది.