న్యూఢిల్లీ: బిపిన్ రావత్ అకాల మరణంతో ఖాళీ అయిన సీడీఎస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర కసరత్తు మొదలుపెట్టింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రేసులో ముందున్నారు. ఐదు నెలల్లో పదవీ విరమణ పొందనున్న నరవణే సీడీఎస్ పోస్టుకు అర్హుడని రిటైర్డ్ మిలిటరీ కమాండర్లు కూడా సూచిస్తున్నారు. సీడీఎస్‌ను ఎంపిక చేసేందుకు ఆర్మీ, నేవీ, వాయుసేనల నుంచి సీనియర్ కమాండర్లతో కూడిన ప్యానెల్‌ను కేంద్రం ఏర్పాటు చేయనుంది.