న్యూఢిల్లీ: ఆర్మీ అంతర్గత కమ్యూనికేషన్ కోసం, కొత్త మెసేజింగ్ అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే, ఆసిగ్మా (ASIGMA) అనే కొత్త మెసేజింగ్ అప్లికేషన్ను గురువారం ప్రారంభించారు. ఆసిగ్మా (ASIGMA) అంటే ఆర్మీ సెక్యూర్ ఇండీజీనియస్ మెసేజింగ్ అప్లికేషన్. ఈ కొత్త మెసేజింగ్ అప్లికేషన్ను ఆర్మీ అధికారుల బృందం పూర్తిగా అంతర్గతంగా అభివృద్ధి చేసినట్లు అధికార ప్రకటనలో పేర్కొన్నారు.