త్వరలో జరగనున్న పునర్విభజనపై రాష్ర్టాలు నిజంగానే ఆందోళన చెందుతున్నాయా? లేక ఏదైనా రాజకీయ అజెండాతో దీనిపై చర్చలు జరుపుతున్నాయా? అని ఆరెస్సెస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.
డీలిమిటేషన్‌పై చర్చకు చెన్నైలో విపక్ష నేతలు సమావేశమవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ కేంద్రం ఇంకా ఆ ప్రక్రియను ప్రారంభించ లేదు కనుక అనవసర చర్చలు ఆపాలని సూచించారు.