న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్ట్ గురువారం తుది విచారణ ప్రారంభించింది. పౌరసత్వానికి ఆధార్‌ను ప్రశ్నించలేని ఆధారంగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ‘పొరుగు దేశానికి చెందిన ఓ వ్యక్తి ఇక్కడ కూలీగా పని చేస్తుంటే అతడిని ఓటేసేందుకు అనుమతిస్తారా’ అని సీజేఐ పిటిషనర్లను ప్రశ్నించారు.
దీనిపై పిటిషనర్ల తరపు న్యాయవాది కపిల్ సిబల్ స్పందిస్తూ సాధారణ ఓటర్లపై సర్ ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమైన భారాన్ని మోపుతున్నదని, ఓటర్ల జాబితాలో తమ పేరును తొలగించే ప్రమాదాన్ని వారు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనికి కోర్టు స్పందిస్తూ సరైన నోటీస్ ఇచ్చాకే ఎవరి పేరునైనా ఓటర్ జాబితా నుంచి తొలగించాలని చెప్పింది.