న్యూఢిల్లీ: ఆరావళి పర్వత శ్రేణిలో మూడవ వంతు పర్యావరణ ముప్పును ఎదుర్కొంటున్నదని ఓ స్వతంత్ర సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆరావళి పర్వత పరిక్షణ సమితి ‘వీ ఆర్ ఆరావళి’ ఇందుకు సంబంధించి శాటిలైట్ డాటాను శనివారం విడుదల చేసింది. మైనింగ్‌తో ఇప్పటివరకు 0.19 శాతమే దెబ్బ తిన్నదంటూ కేంద్రం చేస్తున్న వాదనను తోసిపుచ్చింది. ఆరావళి ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలను పూర్తిగా నిషేధించాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
‘100 మీటర్ల ఎత్తు’ అనే విధానంతో ఆరావళి పర్వత శ్రేణిలో 31.8 శాతం ప్రభావితమైందని, 0.19 శాతమే నంటూ కేంద్రం చెబుతున్నదానికి క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన లేదని తెలిపింది. పర్యావరణవేత్త, డాక్టర్ సుధాన్షు మాట్లాడుతూ, ‘తక్కువ ఎత్తులో ఉన్న కొండలను బంజరు భూములుగా తప్పుగా చూపిస్తున్నారని పేర్కొన్నారు.