చెన్నై: ఆస్కార్ విజేత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆదివారం డీహైడ్రేషన్‌తో బాధపడ్డారు. ఆయనను ఆదివారం ఉదయం ఓ కార్పొరేట్ దవాఖానలో చేర్పించారు. కొన్ని పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్యం సాధారణంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఈ వివరాలను ఆయన సోదరి రిహానా, మేనేజర్ సెంథిల్ వేలన్ తెలిపారు. ఆయన బ్రిటన్ నుంచి వచ్చారని, విమాన ప్రయాణం వల్ల బడలికగా ఉన్నారని వేలన్ చెప్పారు. ఆయన ఛాతీ నొప్పితో బాధపడినట్లు వచ్చిన వార్తలను రిహానా తోసిపుచ్చారు.