పుణె: యాపిల్(Apple) సంస్థ కొత్త రిటైల్ స్టోర్‌ను ఓపెన్ చేయనున్నది. పుణెలో సెప్టెంబర్ 4వ తేదీన ఆ స్టోర్‌ను ఓపెన్ చేస్తున్నారు. యాపిల్ కోరేగావ్ పార్క్‌లో ఈ స్టోర్ ఉంది. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు కొత్త యాపిల్ స్టోర్‌ను ఓపెన్ చేయనున్నారు. గత వారమే బెంగుళూరులో కొత్త యాపిల్ స్టోర్‌ను ఆ కంపెనీ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. దీనికి పూర్వం ఈ మధ్యనే ముంబై, ఢిల్లీ నగరాల్లో రిటేల్ స్టోర్లను ఓపెన్ చేసింది. కొత్త స్టోర్‌లో యాపిల్ సంస్థకు చెందిన అన్ని ప్రోడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. సర్వీస్‌ను కూడా కల్పిస్తున్నారు.
టీమ్ సభ్యుల నుంచి పర్సనల్ సపోర్టు ఉంటుందని యాపిల్ సంస్థ తన ప్రకటనలో చెప్పింది. యాపిల్ కోరేగావ్ పార్క్‌లో మొత్తం 68 మంది సభ్యులు ఉంటారని యాపిల్ రిటేల్ శాఖ వైస్ ప్రెసిడెంట్ డెయిర్డ్రీ ఓ బ్రియాన్ పేర్కొన్నారు. ఐఫోన్ 16 లైనప్, ఐప్యాడ్ ఎయిర్ విత్ యాపిల్ పెన్సిల్ ప్రో, ఎం4 పవర్డ్ మాక్‌బుక్ ఎయిర్ ఉత్పత్తుల గురించి కస్టమర్లకు వివరిస్తారన్నారు.