World Inequality Index | ఓవైపు బతుకు పోరాటం.. మరోవైపు లగ్జరీకి ఆరాటం.. ఆర్థిక అంతరాలు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి.
World Inequality Index | న్యూఢిల్లీ: దేశానికి స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. నిత్యం పెరుగుతున్న ధరలు, ఇతర కారణాలతో కోట్ల మంది కూడు, గూడు, గుడ్డ కోసం ఇంకా బతుకు పోరాటం చేస్తుండగా.. మరోవైపు ఇదే సమయంలో సంపన్నులు పోటీపడి మరీ లగ్జరీ లైఫ్ అనుభవించడంతో పాటు విలువైన వస్తువుల కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు ఇటీవల ముంబైలో ప్రారంభమైన యాపిల్ స్టోర్‌కు పలువురు పోటెత్తడమే ఉదాహరణ. ఈ తరహా ఆర్థిక అంతరాలు దేశానికి ఎంతమాత్రం మంచిది కాదని, దేశాభివృద్ధికి ఆటంకం అని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక అంతరాలు అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఉన్నదని వరల్డ్ ఇన్‌ఈవ్వాలిటీ ఇండెక్స్-2022 పేర్కొన్నది. భారత్‌లో దేశ ఆదాయంలో టాప్ 10 శాతం లేదా 1 శాతం సంపన్నుల వద్ద వరుసగా 57 శాతం, 22 శాతం సంపద ఉన్నదనే ఆందోళనకర విషయాన్ని వెల్లడించింది.

పెరిగిన కార్ల అమ్మకాలు.. తగ్గిన బైక్‌ల సేల్స్
ఇటీవల యాపిల్ సంస్థ ముంబైలో తన తొలి రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. అక్కడ ఒక్కొక్కటి రూ.లక్ష అంతకంటే ఎక్కువ ఖరీదు చేసే విలువైన ఫోన్ల కోసం స్టోర్ ముందు సంపన్నులు క్యూ కట్టారు. కాగా, మునుపటి ఏడాది కంటే 2022లో భారత్‌లో లగ్జరీ కార్ల అమ్మకాలు పెరిగాయి. ఇదే సమయంలో మధ్యతరగతి ప్రజలు వినియోగించే బైక్‌లు, దేశీయ తయారీ సంస్థ బజాజ్ ఆటో అమ్మకాలు 10 శాతం పడిపోయాయి. భారత్‌ను తమ వేగవంతమైన మార్కెట్‌గా భావిస్తున్న లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ అమ్మకాలు గణనీయంగా ఉంటాయని అంచనా వేస్తున్నది. పైన పేర్కొన్న దానికి విరుద్ధంగా దేశంలో 63 శాతం పేద, మధ్య తరగతి వినియోగదారులు అనవసరమైన వస్తువులు, సేవలపై ఖర్చులను పరిమితం చేసుకొంటున్నారని 2023 పీడబ్ల్యూసీ గ్లోబల్ కన్జ్యూమర్ ఇన్సైట్స్ పల్స్ సర్వే పేర్కొన్నది. తమ వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులపై ఆందోళన చెందుతున్నామని సర్వేలో పాల్గొన్న 74 శాతం మంది పేర్కొన్నారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

