ముంబై: యాపిల్ స్టోర్ ఇవాళ ముంబైలో ఓపెన్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ ఓపెనింగ్ కోసం వచ్చిన ఓ వ్యక్తి తన వద్ద ఉన్న వింటేజ్ యాపిల్ కంప్యూటర్(Apple Vintage Computer)ను తీసుకొచ్చాడు. యాపిల్ యూజర్ అయిన ఆ వ్యక్తిని టిమ్ కుక్ కూడా కలిశారు. 1984 నాటి ఆ యాపిల్ కంప్యూటర్ను చూసి .. టిమ్ కుక్ థ్రిల్ అయ్యారు.
#WATCH | Apple CEO Tim Cook surprised at seeing a customer bring his old Macintosh Classic machine at the opening of India's first Apple store at Mumbai's BKC pic.twitter.com/MOY1PDk5Ug
— ANI (@ANI) April 18, 2023
యాపిల్ జర్నీ ఎలా సాగిందో తెలిపేందుకు తాను తన వద్ద ఉన్న వింటేజ్ యాపిల్ కంప్యూటర్ను తీసుకువచ్చినట్లు చెప్పాడు. ముంబైలోని బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో యాపిల్ తన రిటేల్ స్టోర్‌ను ఓపెన్ చేసింది. ఆ స్టోర్ వద్ద యాపిల్ అభిమానులు భారీ క్యూ కట్టారు. ఓ అభిమాని తన వద్ద ఉన్న 1984 నాటి యాపిల్ కంప్యూటర్ను పట్టుకున్నాడు. అతన్ని కలిసిన టిమ్ కుక్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
1984 నుంచి యాపిల్ ప్రొడక్ట్స్‌ను వాడుతున్నానని, ఇది 2 మెగాబైట్స్ బ్లాక్ అండ్ వైట్ కంప్యూటర్ అని, కానీ ఇప్పుడు యాపిల్ సంస్థ 4కే, 8కే రెజల్యూషన్ డిస్ప్లేలు తయారు చేస్తోందని ఆ వ్యక్తి తెలిపారు. యాపిల్ సంస్థ తన రెండవ స్టోర్‌ను ఢిల్లీలో ఈ నెల 20వ తేదీన ఓపెన్ చేయనున్నది.