Malaysia | కౌలాలంపూర్, ఆగస్టు 24: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో శుక్రవారం హఠాత్తుగా నడక దారి కుంగిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయలక్ష్మి(45) 8 మీటర్ల గొయ్యిలో గల్లంతయ్యారు. చిత్తూరు జిల్లా అనిమిగాని పల్లెకు చెందిన ఆమె కౌలాలంపూర్‌లో కుటుంబంతో కలిసి పూసల వ్యాపారం చేస్తున్నట్టు సమాచారం. ఘటన జరిగిన డాంగ్ వాంగి ప్రాంతం రెండు ప్రధాన నదుల మధ్యలో ఉంది.
గురువారం ఆకస్మిక వర్షాల వల్ల ఆ ప్రాంతంలో హఠాత్తుగా వరదలు సంభవించాయి. బాధితురాలి జాడ కనిపెట్టే వరకు గాలింపు కొనసాగుతుందని స్థానిక పోలీస్ అధిపతి తెలిపారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీ సాయంతో ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.