న్యూఢిల్లీ: క్రికెట్ విరాట్ కోహ్లీ(Virat Kohli), భార్య అనుష్కా శర్మ.. డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నారు. ఓ పంజాబీ పాటపై ఆ ఇద్దరూ స్టెప్పులేశారు. ఆ వీడియోను అనుష్కా తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది. పంజాబీ ఆర్టిస్టు శుభ్ పాడిన పాటకు .. జిమ్‌లో కోహ్లీ, అనుష్కాలు స్టెప్పులేశారు. ఫుల్ ఎనర్జిటిక్‌గా డ్యాన్స్ చేస్తున్న ఆ జంటను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తమ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. డ్యాన్స్ చేస్తూ రూమ్‌లోకి ఎంటర్ అయిన కోహ్లీ .. రెండు స్టెప్పులేసి కాలు పట్టేసుకున్నాడు. దీంతో అనుష్కా నవ్వుతూ ఉండిపోయింది. ఆ వీడియోకు డ్యాన్స్ పే ఛాన్స్ స్కిల్స్ అన్న టైటిల్ కూడా ఇచ్చిందామె.