న్యూఢిల్లీ: గురుగ్రామ్‌కు చెందిన అనురాధ గార్గ్ ప్రతిష్టాత్మకమైన ‘మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్-2025’ విజేతగా నిలిచారు. ఈ ఏడాది చైనాలోని షెన్జెన్ నగరంలో ఏప్రిల్ 4 నుంచి 13 వరకు నిర్వహించిన పోటీల్లో 80కిపైగా దేశాలకు చెందిన మహిళామణులు పాల్గొన్నారు. పోటీల్లో భారతదేశ శక్తి, స్ఫూర్తికి ప్రతినిధిగా అనురాధ నిలిచారు. ఈ టైటిల్‌ను అందుకున్న తొలి భారతీయురాలిగా గార్గ్ రికార్డ్ సృష్టించారు.