NIA | ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ (National Investigation Agency) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. దాడికి పాల్పడిన ఉగ్రమూకల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం జమ్ము అంతటా ఎన్ఐఏ అధికారులు విస్తృతంగా సోదాలు చేపడుతున్నారు. పుల్వామా, కుల్గాం, షోపియన్, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లోని 32 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. పహల్గాం ఉగ్రదాడి మూలాలను కనిపెట్టడంపై ఫోకస్ పెట్టిన అధికారులు.. స్లీపర్ సెల్స్‌ను గుర్తించడమే లక్ష్యంగా దాడులు చేపడుతున్నారు.
కాగా, ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలోని మినిస్విట్జర్లాండ్గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. సమీపంలోని అడవిలో నుంచి వచ్చిన ఉగ్రమూక బైసరాన్ వ్యాలీలోని పచ్చిక బైళ్లపై సేద తీరుతున్న పర్యాటకులపై దాడి చేసింది. వారి కుటుంబ సభ్యుల ముందే విచక్షణా రహితంగా కాల్చి చంపింది. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Also Read..
Bengaluru Stampede | బెంగళూరు తొక్కిసలాట.. మృతులు వీళ్లే..
Harsh Goenka | దేశంలో సామాన్యుడి ప్రాణాలకు విలువ లేదా..? తొక్కిసలాట ఘటనపై హర్ష్ గోయెంకా పోస్ట్
Stampede | తొక్కిసలాట ఘటన.. సుమోటోగా విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు