ముంబై, అక్టోబర్ 21: తమ సభ్యులు వినియోగించుకునేందుకు ఒక్కొక్కటి దాదాపు రూ. 70 లక్షలు ఖరీదు చేసే 7 హై-ఎండ్ బీఎండబ్ల్యూ 330 ఎల్ఐ లాంగ్ వీల్ బేస్ కార్లను కొనుగోలు చేసేందుకు లోక్పాల్ ఇండియా టెండర్లను ఆహ్వానించడం తీవ్ర వివాదాస్పదమైంది.
నవంబర్ 7న టెండర్లను తెరుస్తారు. అవినీతిని నిరోధించేందుకు ఏర్పడిన లోక్పాల్ తమ విలాసాల కోసం ఇంత విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయాలని నిర్ణయించడంపై ప్రజల నుం చి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోం ది. సభ్యులు తమ విలాసాల కోసం ఈ కార్లను కొనుగోలు చేసుకుంటున్నారని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ విమర్శించారు.