ముంబై, జూన్ 7: ముంబయిలో నిర్వహిస్తున్న ఓ మ్యూజిక్ ఈవెంట్ వద్ద మరో విద్యార్థి హఠాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. మరో మహిళ తీవ్ర అస్వస్థతకు గురై..కుప్పకూలటం కలకలం రేపింది. అధిక మొత్తంలో మద్యం, మాదక ద్రవ్యాలు తీసుకొని ఉంటారా? అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శనివారం సాయంత్రం నగరంలోని ‘నెస్కో’ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన ‘టెక్నో మ్యూజిక్’ వేడుక వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు 28 ఏండ్ల వృషభ్ గంగూర్డెగా గుర్తించారు. రెండు నెలల క్రితం ఇక్కడే ఇద్దరు ఎంబీఏ విద్యార్థులు కుప్పకూలి ప్రాణాలు వదలటం సంచలనం రేపింది. తాజాగా మరో విద్యార్థి ప్రాణాలు వదలటంతో ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మ్యూజిక్ ఈవెంట్కు హాజరైన 31 ఏండ్ల మహిళ మద్యం, ఎనర్జీ డ్రింక్స్ తాగిన తర్వాత అస్వస్థతకు గురైనట్టు తెలిసింది.