Bridge Collapses | బీహార్‌లో కూలిన మరో బ్రిడ్జి.. 15 రోజుల్లో ఆరో ఘటన
Bridge Collapses | ఎన్డీయే పాలిత బీహార్ (Bihar)లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న (Bridge Collapses) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో బ్రిడ్జి కూలింది.
Bridge Collapses | ఎన్డీయే పాలిత బీహార్ (Bihar)లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న (Bridge Collapses) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో బ్రిడ్జి కూలింది. సివాన్ (Siwan) జిల్లాలోని గండకి నదిపై (Gandaki river) నిర్మించిన ఈ చిన్న వంతెనలోని ఒక భాగం బుధవారం ఉదయం కూలిపోయింది. వంతెన కూలిపోవడానికి గల కచ్చితమైన కరాణాలపై విచారణ జరుపుతున్నట్లు డిప్యూటీ డెవలప్మెంట్ కమిషనర్ ముఖేష్ కుమార్ తెలిపారు.
‘బుధవారం ఉదయం డియోరియా బ్లాక్‌లోని వంతెన యొక్క ఒక భాగం కూలిపోయింది. బ్రిడ్జి కూలడానికి గల ఖచ్చితమైన కారణాలు ఇప్పటివరకూ తెలియరాలేదు. సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటన తెల్లవారుజామున 5 గంటలకు జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ వంతెన 1982-83లో నిర్మించారు. గత కొన్ని రోజులుగా ఈ వంతెనపై మరమ్మతు పనులు జరుగుతున్నాయి’ అని ఆయన తెలిపారు.
కాగా, రాష్ట్రంలో వంతెన కూలిపోవడం 15 రోజుల వ్యవధిలో ఇది ఆరోది. సివాన్ జిల్లాలో 11 రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం. గత నెల 22న సివాన్ జిల్లాలో చిన్నపాటి వంతెన ఒకటి కుప్పకూలింది. దారౌందా, మహారాజా గంజ్ బ్లాక్స్‌లోని రెండు గ్రామాలను కలుపుతూ కెనాల్‌పై కట్టిన ఈ బ్రిడ్జ్..చాలా ఏండ్ల క్రితం నాటిదని, కెనాల్‌లోని నీటి ప్రవాహ ధాటికి పిల్లర్లు దెబ్బతిని వంతెన కూలిందని జిల్లా కలెక్టర్ ముకుల్ కుమార్ గుప్తా తెలిపారు.
జూన్ 27న కిషన్‌బాగ్ జిల్లాలో, జూన్ 23న తూర్పు చంపారన్ జిల్లాలో, 22న సిశాన్‌లో, 19న అరారియాలో ఇలాగే వంతెనలు కూలిపోయాయి. ఆ తర్వాత జూన్ 29న మధుబని (Madhubani) ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది.
వరుసగా వంతెనలు కూలిపోతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదులు, కాలువలపై నిర్మించిన వంతెనల పటిష్టతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పబ్లిక్ వర్క్స్‌లో నాణ్యతా లోపాలు, అక్రమాల వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. వరుస ప్రమాదాలతో అధికారులు కూడా ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ప్రమాదవశాత్తు కూలిపోయాయా..? లేక ఎవరైనా కావాలనే కూల్చి వేస్తున్నారా..? అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.
Also Read..
Zika virus | పూణెలో జికా వైరస్ కలకలం.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం అడ్వైజరీ
Team India | ఎట్టకేలకు బార్బడోస్‌ను వీడిన టీమ్ఇండియా.. ప్రత్యేక ఫ్లైట్‌లో భారత్‌కు పయనం
Rajasthan | కదులుతున్న కారుపై పడిన హైవోల్టేజ్ విద్యుత్ స్తంభం.. షాకింగ్ వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

