Zika virus | పూణెలో జికా వైరస్ కలకలం.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం అడ్వైజరీ
Zika virus | మహారాష్ట్రలోని పూణె (Pune) లో జికా వైరస్ (Zika Virus) కలకలం సృష్టిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్రలో జికా వైరస్ కేసుల దృష్ట్యా అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది (Centre issues advisory).
Zika virus | మహారాష్ట్రలోని పూణె (Pune) లో జికా వైరస్ (Zika Virus) కలకలం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడినవారిలో ఇద్దరు గర్భవతులు కూడా ఉన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్రలో జికా వైరస్ కేసుల దృష్ట్యా అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది (Centre issues advisory).
ముఖ్యంగా గర్భిని స్త్రీలకు వైరస్ పరీక్షలు నిర్వహించాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. పాజిటివ్ తేలిన తల్లుల పిండాల పెరుగుదలను పర్యవేక్షించడం ద్వారా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఇంటి ఆవరణలో ఏడిస్ దోమలు లేకుండా చూసేందుకు నోడల్ అధికారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించింది. నివాస ప్రాంతాలు, కార్యాలయాలు, పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, సంస్థలు, ఆరోగ్య సౌకర్యాల్లో కీటకాలు లేకుండా నిఘా పెంచాలని, నియంత్రణ కార్యకలాపాలను తీవ్రతరం చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.
కాగా, జులై 1న పూణెలో ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి జికా వైరస్ పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. నగరంలోని అరంద్వానే (Erandwane) ప్రాంతంలో నాలుగు, ముండ్వా ప్రాంతంలో రెండు కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం అరంద్వానేలో మొదటి కేసు నమోదయింది. 46 ఏండ్ల డాక్టర్ తొలుత జికా వైరస్ బారిపడ్డారు. అనంతరం అతని కుమార్తె (15)కు వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వీరిద్దిరితోపాటు ముండ్వాకు చెందిన ఇద్దరి రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చాయి. ఈ నాలుగురితోపాటు అరంద్వానేకు చెందిన ఇద్దరు గర్భిణులకు జికా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
జికా వైరస్ సోకిన ఆడ ఎడిస్ దోమ (Aedes mosquito) కుట్టడం వల్ల వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని ఓ కోతిలో గుర్తించారు. ఆ తర్వాత ఆఫ్రికన్ దేశాలతోసహా భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి ఆసియా దేశాలకూ ఈ వ్యాధి వ్యాప్తి చెందింది. ఈ వైరస్ సోకినవారిలో జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణకోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Also Read..
Rajasthan | కదులుతున్న కారుపై పడిన హైవోల్టేజ్ విద్యుత్ స్తంభం.. షాకింగ్ వీడియో
Assam Floods | కజిరంగ నేషనల్ పార్క్‌ను ముంచెత్తిన వరద.. నీట మునిగిన జంతువులు.. VIDEO
Women Missing | మధ్యప్రదేశ్‌లో మూడేళ్లలో 31 వేల మంది మహిళలు మిస్సింగ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

