చెన్నై: తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీని గద్దె దించేవరకు చెప్పులు వేసుకోకుండా వట్టి కాళ్లతో నడుస్తానని బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై శపథం చేశారు.
కోయంబత్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి డబ్బు పంచకుండా ఎన్నికల్లో విజయం సాధిస్తామని, డీఎంకే ఓడేవరకు తాను పాదరక్షలు ధరించనని అన్నారు. అన్ని చెడులు తొలగిపోవడానికి కోయంబత్తూరులోని తన నివాసంలో శుక్రవారం ఆరుసార్లు కొరడాతో కొట్టుకుంటానని, ఆరు మురుగన్ క్షేత్రాలకు వెళ్లడానికి 48 రోజుల దీక్ష చేస్తానన్నారు.