ముంబై : ప్రముఖ సామాజిక సేవా కార్యకర్త అన్నా హజారే అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను గురువారం పుణెలోని రూబీ ఆసుపత్రిలో చేర్పించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వైద్యుల పరిశీలనలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయన ఆసుపత్రిలో చేరిన విషయాన్ని రూబీ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అవధూత్ ధ్రువీకరించారు.