Uttar Pradesh | లక్నో: అన్నాచెల్లెలు డబ్బు కోసం చేయకూడని పని చేశారు. కొత్తగా పెండ్లి చేసుకున్న జంటకు ప్రభుత్వం అందజేసే నగదు సాయాన్ని పొందేందుకు అక్రమ మార్గం తొక్కారు. ఉత్తరప్రదేశ్ హాథ్రస్ జిల్లాలో రూ.35 వేల కోసం అన్నాచెల్లెలు వివాహం చేసుకోవటం అందర్నీ షాక్కు గురిచేసింది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో అన్నాచెల్లెలు వివాహ బాగోతం బయటపడింది. దీనిపై జిల్లా అధికారులు దర్యాప్తు చేపట్టారు. యూపీ ప్రభుత్వం అమలుజేస్తున్న పథకం ‘ముఖ్యమంత్రి సామూహిక్ వివాహ యోజన’ అక్రమార్కులకు బంగారు బాతుగా మారింది.