పంజాబ్ కొత్త అడ్వకేట్ జనరల్‌గా అన్మోల్ రతన్ సిధూను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయ సలహా కోసం కేవలం రూపాయి మాత్రమే తీసుకుంటానని ఆయన సంచలన ప్రకటన చేశారు. ఓ జాతీయ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వంపై భారం పడకూడదన్న ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా కేసులను అత్యంత పారదర్శకతతోనే వాదిస్తానని, అందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదన్నారు.
అన్మోల్ రతన్ సిధూ అత్యంత పేరు మోసిన లాయర్. క్రిమిలన్, సివిల్, భూ వివాదాల విషయంలో చాలా కేసులు వాదించారు. హైకోర్టులో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయన చేసిన సేవలకు గాను పంజాబ్ రాష్ట్ర అత్యున్నత పురస్కారమైన పర్మాన్ పాత్ర అవార్డును కూడా అందుకున్నారు. 2008 నుంచి 2014 వరకూ ఈయన సొలిసిటరీ జనరల్‌గా పనిచేశారు.