హైదరాబాద్, మే 20: హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ భూ విజ్ఞాన శాస్త్ర మాజీ విభాగాధిపతి ప్రొ.ఎన్ సుబ్బారావు అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. స్వతంత్ర విద్యా ర్యాంకింగ్ వేదిక అయిన రిసెర్చి.కామ్ సంకలనం చేసిన ఉత్తమ భూ శాస్త్ర శాస్త్రవేత్తలు 2025 జాబితాలోఆయన చోటుదక్కించుకున్నారు. ఆయన ఎర్త్సైన్స్లో భారత్‌లో 44వ ర్యాంక్, ప్రపంచ వ్యాప్తంగా 6,329 ర్యాంక్‌ను దక్కించుకున్నట్టు రిసెర్చి.
కామ్ వెల్లడించింది. ఆయన ఇప్పటివరకు ప్రఖ్యాత జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో 130కి పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ఆయన భారత ప్రభుత్వం నుంచి జాతీయ ఖనిజ అవార్డు (2009), రాష్ట్ర శాస్త్రవేత్త అవార్డు (2009), ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2014) పొందారు.