ముంబై: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ చేతి గడియారం వార్తల్లోకెక్కింది. ఇటీవల తన భార్య రాధికతో కలిసి అనంత్ అంబానీ బయటకు వెళ్లినప్పుడు ఆయన చేతి గడియారం అందరి దృష్టిని ఆకర్షించింది. నీలం రంగు డయల్‌తో ఉన్న ఈ గడియారం గురించి ఔత్సాహికులు ఇంటర్నెట్లో వెతకగా దిమ్మతిరిగిపోయే విషయాలు కనిపించాయి.
రిచర్డ్ మిల్లే బ్రాండ్‌కు చెందిన ఈ వాచ్ ధర అక్షరాలా రూ.22 కోట్లు ఉన్నట్టు గుర్తించారు. ఈ మాడల్ వాచ్‌లను రిచర్డ్ మిల్లే కంపెనీ ఇప్పటివరకు మూడు మాత్రమే తయారుచేయగా, అందులో ఒకటి అనంత్ అంబానీ చేతికి చేరింది. అనంత్ అంబానీ వాచ్‌ల కలెక్షన్లో ఇలాంటి ఖరీదైనవి చాలానే ఉన్నాయి.