ముంబై, జూలై 12: ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చంట్‌తో వైభవంగా జరిగింది. ముంబైలో శుక్రవారం జరిగిన ఈ వేడుకకు రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

యూకే మాజీ ప్రధాని టోని బ్లెయిర్, నటీనటులు జాన్ సీనా, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్, రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, టైగర్ ష్రాఫ్, వరుణ్ ధావన్, రజినీకాంత్, రామ్ చరణ్, మహేశ్ బాబు, క్రీడాకారులు సచిన్ టెండుల్కర్, ధోని, తదితరులు వివాహ వేడుకకు హాజరయ్యారు.
