న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ స్ఫూర్తిదాయక పోస్టులతో పాటు ఆలోచన రేకెత్తించే వీడియోలను (Viral Video) షేర్ చేసే మహీంద్ర గ్రూప్ చీఫ్ ఆనంద్ మహీంద్ర మరో ఆసక్తికర పోస్టుతో నెటిజన్లను ఆకట్టుకున్నారు. ఇక పారిశ్రామిక దిగ్గజం లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మంజరి దాస్ అనే యూజర్ ఈ వీడియోను తొలుత ట్విట్టర్లో షేర్ చేయగా ఆనంద్ మహీంద్ర రీషేర్ చేశారు.
మంచంలా ఉన్న సీటుతో కూడిన వాహనాన్ని ఓ వ్యక్తి నడుపుతున్న వీడియోను కార్పొరేట్ దిగ్గజం షేర్ చేయగా నెట్టింట ఈ క్లిప్ అందరినీ ఆకర్షిస్తోంది. ఈ వాహనం ప్రాంక్ అయి ఉంటుందని, దీని తయారీలో పలు నియంత్రణలను కూడా ఉల్లంఘించినట్టు కనిపిస్తోందని క్యాప్షన్‌లో బిలియనీర్ రాసుకొచ్చారు. ఈ వైరల్ క్లిప్‌లో పెట్రోల్ బంకులో బెడ్ వెహికల్‌ను ఓ వ్యక్తి నడుపుతుండటం చూడొచ్చు.
I must have received this video from at least from ten friends. I didn’t RT it because it seemed more like a prank jugaad to get attention & also violates most regulations. But to be honest, I never thought about the application you have referred to. Yes, who knows, it could turn… https://t.co/MmF9rrVqfk
— anand mahindra (@anandmahindra) June 10, 2023
ఈ వాహనాన్ని ఇంజన్, నాలుగు వీల్స్, స్టీరింగ్ వీల్‌తో డిజైన్ చేశారు. మారుమూల ప్రాంతాల్లో అసాధారణ పరిస్ధితులు నెలకొన్నప్పుడు ఈ వాహనం ప్రాణాలు నిలబెట్టే సంజీవనిగా మారుతుందేమో ఎవరికి తెలుసని క్యాప్షన్‌లో ఆనంద్ మహీంద్ర చెప్పుకొచ్చారు.
Read More
Ravi Teja | రవితేజ కొత్త సినిమా నుంచి క్రేజీ అప్డేట్..!