న్యూఢిల్లీ : నూతన సంవత్సరం నూతన ఆరంభాలను స్వాగతిస్తుందని..గతంలో చోటుచేసుకున్న ప్రతికూలతలను వెనక్కినెట్టేందుకు కూడా ఇదే సరైన సమయమని కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహింద్ర అంటున్నారు. ఆశావహ దృక్పధంతో కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్ర సోషల్ మీడియోలో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు.
Here’s how I’m going to dance with happiness tonight to bid farewell to 2022—The war in Ukraine & Covid’s resurgence made this a year I’m happy to see the back of. May the New Year see those big disasters dealt with… pic.twitter.com/k8tQjRVd53
— anand mahindra (@anandmahindra) December 31, 2022
ట్విట్టర్లో ఆయన షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి జానపద నృత్యం చేస్తుండటం కనిపించింది. ఆనందంతో, ఎలాంటి పట్టింపులు లేకుండా అతడు చేస్తున్న డ్యాన్స్ మీ విచారాలను కూడా తుడిచేస్తుందని ఆనంద్ మహింద్ర చెప్పుకొచ్చారు. 2022ను ముగించేందుకు ఈ రాత్రి నేను కూడా సంతోషంగా డ్యాన్స్ చేస్తాను- గడిచిన ఏడాది ఉక్రెయిన్ వార్, కొవిడ్ పునరుద్ధానం వంటి సమస్యలను విడిచిపెట్టి కొత్త ఏడాదిని సంతోషంగా స్వాగతించాలని రాసుకొచ్చారు.
నూతన సంవత్సరం అలాంటి వైపరీత్యాలను దీటుగా ఎదుర్కోవాలని అని ఆ పోస్ట్‌కు ఆనంద్ మహింద్ర క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 4 లక్షలకు పైగా వ్యూస్ రాగా నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. మహింద్ర వ్యాఖ్యలను పలువురు యూజర్లు సమర్ధిస్తూ ప్రపంచం శాంతి సామరస్యాలతో వెల్లివిరియాలని కోరుకుంటున్నామని కామెంట్ చేశారు.