సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే వ్యాపారవేత్తల్లో మహీంద్ర సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్ర ఒకరు. తనకు తోచిన విషయాలను, కనిపించిన అద్భుతాలను అందరితో పంచుకుంటూ సంతోషిస్తారాయన. అలాగే ఇటీవల అగ్రరాజ్యం అమెరికాలోని మ్యాన్హాటన్ నుంచి కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ‘‘జులై 4న మ్యాన్హాటన్ ఆకాశం’’ అని ట్వీట్ చేశారు.
దానికి కొన్ని ఫొటోలు, ఒక వీడియో కూడా జత చేశారు. అమెరికాలో జులై 4న స్వతంత్ర వేడుకలు జరుగుతాయని తెలిసిందే. దీంతో ఒక యూజర్ ఆనంద్ మహీంద్ర పౌరసత్వాన్ని ప్రశ్నించాడు. ‘‘మీరు ఎన్నారైనా?’’ అని అడిగాడు. దానికి బదులిచ్చిన మహీంద్రా.. ‘‘న్యూయార్క్లో కుటుంబాన్ని కలుద్దామని వచ్చానంతే. కాబట్టి నేను హెచ్ఆర్ఐ. హార్ట్ (ఆల్వేస్) రెసిడెంట్ ఇన్ ఇండియా (మనసు ఎప్పుడూ భారత్లోనే)’’ అంటూ ట్వీట్ చేశారు.
అది చూసిన నెటిజన్లు ఆయన సమాధానానికి ఫిదా అయిపోయారు. కొందరేమో అసలు ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే చెప్పొద్దని సూచించారు. ఏదేమైనా ఆనంద్ మహీంద్రా ఇచ్చిన సూపర్ సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Manhattan 4th of July. 2022 Skyline erupts. (2/3) pic.twitter.com/rmHvUSZ3mz
— anand mahindra (@anandmahindra) July 5, 2022
Manhattan. 4th of July. 2022. It’s hard for man-made light to compete with the moon! (3/3) pic.twitter.com/388sXbFg5Q
— anand mahindra (@anandmahindra) July 5, 2022
Just visiting family in New York. So am an HRI. Heart (always) resident in India….😊 https://t.co/ydzwTux9vr
— anand mahindra (@anandmahindra) July 5, 2022