Bus in river : భారత్‌కు చెందిన ఓ ప్రయాణికుల బస్సు (Indian passenger bus) నేపాల్ (Nepal) లో నదిలోకి దూసుకెళ్లింది. నదిలోకి దూసుకెళ్లిన బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. నేపాల్‌లోని తానాహున్ జిల్లా (Tanahun district) లో ఈ ఘటన చోటచేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్థానిక అధికారులు తెలిపారు.
‘భారత్‌కు చెందిన యూపీ ఎఫ్టీ 7623 (UP FT 7623) నెంబర్‌గల బస్సు జిల్లాలోని మార్స్యాంగ్డి నదిలోకి దూసుకుపోయింది. అనంతరం నది ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఘటన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది’ అని నేపాల్‌లోని తానాహున్ జిల్లాకు చెందిన డీఎస్సీ దీప్‌కుమార్ రాయ తెలిపారు.
బస్సు పొఖారా నుంచి ఖాట్మండు వస్తుండగా ప్రమాదానికి గురైందని, ఈ ప్రమాదానికి సబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. బస్సులోని 40 మంది ప్రయాణికులకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు.