Rabies | ఢిల్లీ : దేశంలో జంతువుల కాట్ల వల్ల ఏటా సగటున 5726 మంది మరణిస్తున్నారు. ఇందులో 76.8 శాతం కుక్క కాట్లేనని తేలింది. ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్ అధ్యయన వివరాలను ప్రచురించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్-ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా 2022 మార్చిలో 15 రాష్ర్టాల పరిధిలోని 3.37లక్షల మందిని సర్వేలో ప్రశ్నించింది.
జంతువుల కాట్లు, యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ అందుబాటు, మరణాలపై వివరాలు సేకరించింది. సర్వేలో పాల్గొన్న వాళ్లలోనూ 2000 మంది జంతువుల కాట్లకు గురైన వాళ్లున్నారని, వారిలో 76.8శాతం కుక్క కాటు బాధితులని గుర్తించారు.