అహ్మదాబాద్ : గుజరాత్లో పెను విషాదం చోటుచేసుకున్నది. అహ్మదాబాద్‌లో విమానం(Plane Crash) కూలింది. ఆ విమానంలో సుమారు 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆ రాష్ట్ర పోలీసు కంట్రోల్ రూమ్ ద్రువీకరించింది. మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్య విమానం కూలినట్లు భావిస్తున్నారు. విమానం కూలిన ప్రదేశం నుంచి నల్లటి దట్టమైన పొగ వ్యాపిస్తున్నది. విమానం కూలిన ప్రదేశానికి డజన్ల సంఖ్యలో అంబులెన్సులు చేరుకున్నాయి. ఆ ఏరియాలో ట్రాఫిక్‌ను డైవర్ట్ చేశారు. కూలిన విమానం ప్రయాణికులదా లేక కార్గో విమానమా అన్న విషయాన్ని ద్రువీకరించాల్సి ఉన్నది. ఎయిర్‌పోర్టు ప్రాంతం నుంచి గాయపడ్డవారిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.
🚨 BREAKING:
Tragedy in Gujarat! An Air India passenger flight has crashed during takeoff near Meghani, Ahmedabad.Massive rescue operations are underway.
Fears of casualties loom large.💔 Prayers for everyone on board. 🙏#PlaneCrash pic.twitter.com/pGet0IZ9k5
— Priya (@pr00ya) June 12, 2025
మేఘనీనగర్ ప్రాంతంలో విమానం కూలినట్లు చెబుతున్నారు. విమానం నుంచి ఎగసిడపడుతున్న మంటల్ని ఆర్పుతున్నట్లు ఫైర్ ఆఫీసర్ జయేశ్ ఖాదియా తెలిపారు. ఎటువంటి రకమైన విమానం అన్న దానిపై స్పష్టం లేదని అహ్మదాబాద్ పోలీసు కమీషనర్ జీఎస్ మాలిక్ తెలిపారు.
Air India’s AI171 (Ahmedabad- London) with around 242 passengers on board has reportedly crashed near #Ahmedabad (AMD) airport during take off. #AirIndia #PlaneCrash pic.twitter.com/J5sDtzxZis
— The-Pulse (@ThePulseIndia) June 12, 2025