అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా అమూల్ పాల ధరలను గురువారం నుంచి లీటరుకు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది.
అన్ని రకాల అమూల్ మిల్క్ వేరియంట్లకు ఇది వర్తిస్తుందని చెప్పింది. దీంతో గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ)లో 3-4 శాతం పెరుగుతుందని తెలిపింది. ఇది సగటు ఆహార ద్రవ్యోల్బణం కన్నా చాలా తక్కువ అని పేర్కొంది.