బుధవారం 15 జూలై 2020
National - Jun 16, 2020 , 01:32:19

విభేదాలు పక్కన పెట్టి కరోనాపై పోరు : విపక్షాలకు అమిత్‌షా పిలుపు

విభేదాలు పక్కన పెట్టి కరోనాపై పోరు : విపక్షాలకు అమిత్‌షా పిలుపు

న్యూఢిల్లీ: కరోనాపై పోరుకు రాజకీయ పార్టీ లు తమ విభేదాలను మరిచిపోయి, చేతులు కలుపాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. ఢిల్లీలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. దీనికి బీజేపీ, ఆప్‌, కాంగ్రెస్‌, బీఎస్పీ నేతలు హాజరయ్యారు. ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు నాలుగు పార్టీల శ్రేణులు సాయమందించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

తాజావార్తలు


logo