న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ(ఎన్పీఏ) డైరెక్టర్‌గా అమిత్ గార్గ్ నియమితులయ్యారు. ఆయన 1993 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) డైరెక్టర్‌గా మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అలోక్ రంజన్ నియమితులయ్యారు. ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రత్యేక డైరెక్టర్లుగా రిత్విక్ రుద్ర, మహేశ్ దీక్షిత్, ప్రవీణ్ కుమార్, అర్వింద్ కుమార్, సీఐఎస్ఎఫ్ స్పెషల్ డీజీగా ప్రవీర్ రంజన్, సీఆర్పీఎఫ్ స్పెషల్ డీజీగా వితుల్ కుమార్, బీఎస్ఎఫ్ స్పెషల్ డీజీగా ఆర్ ప్రసాద్ మీనాను కేంద్రం నియమించింది.