Dhaka Visa Centre : పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న వేళ భారత విదేశాంక శాఖ (MEA) కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాలో తీవ్రమవుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఢాకా (Dhaka)లోని వీసా కేంద్రాన్ని (Visa Centre) బుధవారం మూసివేసింది. బంగ్లాదేశ్ నాయకులు, అసాంఘిక శక్తుల నుంచి బెదిరింపుల నేపథ్యంలో అక్కడి వీసా అప్లికేషన్ సెంటర్లో సేవలకు మంగళం పాడింది భారత్. బుధవారం మధ్యాహ్నం 2:00 గంటల నుంచి ఈ కేంద్రాన్ని మూసేస్తున్నట్టు.. పరిశీలనలో ఉన్న దరఖాస్తుల తేదీలను మార్చినట్టు ఒక ప్రకటనలో తెలిపింది.
ఢాకాలోని జమున ఫ్యూచర్ పార్క్‌లో భారత వీసా అప్లికేషన్ సెంటర్ ఉంది. మనదేశం రావాలనుకునే బంగ్లాదేశీయులకు ఈ కేంద్రం నుంచే వీసాలు మంజూరు చేస్తారు. అయితే.. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు కొరవడ్డాయి. ఆ దేశంలో రోజురోజుకు సురక్షిత వాతావరణం తగ్గిపోతుండడాన్ని సీరియస్‌గా తీసుకున్న విదేశీ మంత్రిత్వ శాఖ భారత్‌లోని బంగ్లా దౌత్యాధికారికి బుధవారం ఉదయం సమన్లు జారీ చేసింది.
BIG BREAKING 🚨 Indian Visa Application Centre in Dhaka closed at 2:00 pm today amid security concerns.
Yunus fails Bangladesh !!
India has summoned the Bangladesh High Commissioner over threats to Indian diplomats in Dhaka, burning of PM Modi’s effigy and illegal remarks on… pic.twitter.com/3LsCJtP9zm
— News Algebra (@NewsAlgebraIND) December 17, 2025
ఢాకాలో భద్రతాపరమైన సమస్యలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారనే సమాచారం నేపథ్యంలోనే ఆయన నుంచి వివరణ కోరామని ఎంఈఏ తెలిపింది. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను దృష్టిలో ఉంచుకొని.. బంగ్లాదేశ్‌లో భారత మిషన్‌కు మధ్యంతర ప్రభుత్వం భద్రతా కల్పిస్తుందని నమ్ముతున్నాం అని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసిన కొన్ని గంటల్లోనే ఢాకాలోని వీసా కేంద్రాన్ని మూసి వేస్తున్నామని స్పష్టం చేసింది.