చెన్నై, డిసెంబర్ 25: హిందీ మాట్లాడే వాళ్లపై డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలపై వివా దం కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీ నాయకుడు తరుణ్ విజయ్ దక్షిణాదివారిని నల్ల జాతీయులుగా పిలిచిన పాత వీడియోను సోమవారం డీఎంకే ఐటీ విభాగం షేర్ చేసింది. ‘మేము జాత్యంహకారులమైతే మనకు మొ త్తం దక్షిణాది ఎందుకు ఉంటుంది? మేం వారితో ఎందుకు జీవిస్తాం? మన చుట్టూ నల్ల జాతీయులున్నారు’ అని మాజీ రాజ్యసభ ఎంపీ అయిన విజయ్ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. 2017లో అల్జజీరా టీవీ చర్చ సందర్భంగా విజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత తన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పారు.