Watch| బలమైన గాలుల మధ్య.. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కు విమానం యత్నం
Plane's Dramatic Landing Attempt | ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో ఈదురు గాలులు బలంగా వీచాయి. ఈ వాతావరణ పరిస్థితుల్లో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ కోసం ఒక విమానం ప్రయత్నించింది. అయితే బలమైన గాలుల వల్ల ఆ విమానం బాగా ఊగిపోయింది.
చెన్నై: ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో ఈదురు గాలులు బలంగా వీచాయి. ఈ వాతావరణ పరిస్థితుల్లో ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ కోసం ఒక విమానం ప్రయత్నించింది. అయితే బలమైన గాలుల వల్ల ఆ విమానం బాగా ఊగిపోయింది. దీంతో పైలట్ ఆ విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకెళ్లాడు. (Plane’s Dramatic Landing Attempt) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నవంబర్ 30న ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన 6ఈ 683 విమానం ముంబై నుంచి చెన్నై చేరుకున్నది. ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో చెన్నైలో బలంగా గాలులు వీచాయి. దీంతో విమానం ల్యాండింగ్ కోసం పైలట్ చాలా కష్టపడాల్సి వచ్చింది.
కాగా, ఆ ఇండిగో విమానం ల్యాండింగ్ కోసం ప్రయత్నించింది. అయితే బలమైన గాలుల వల్ల అది అటూ ఇటూ ఊగిపోయింది. విమానం రన్‌వేను తాకనుండగా పైలట్ వెంటనే దానిని గాల్లోకి తీసుకెళ్లాడు. ఆ ఎయిర్పోర్ట్ చుట్టూ ఒక రౌండ్ తిరిగిన తర్వాత ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు.
మరోవైపు ఇండిగో సంస్థ ఈ సంఘటనను ధృవీకరించింది. భారీ వర్షం, ఈదురు గాలులు వంటి ప్రతికూల వాతావరణాన్ని ఆ విమానం ఎదుర్కొన్నట్లు తెలిపింది. అందువల్ల భద్రతా ప్రోటోకాల్‌కు అనుగుణంగా గో రౌండ్ కోసం అది గాల్లోకి వెళ్లినట్లు పేర్కొంది. సాధారణంగా విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయలేనప్పుడు ఇలా జరుగుతుందని వివరించింది. అయితే ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ పైలట్లు సరైన శిక్షణ పొందినట్లు ఇండిగో సంస్థ స్పష్టం చేసింది.
కాగా, ఈ సంఘటన తర్వాత ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో 16 గంటల వరకు చెన్నై విమానాశ్రయాన్ని మూసివేశారు. మరోవైపు బలమైన గాలుల మధ్య ఇండిగో విమానం ల్యాండింగ్‌కు ప్రయత్నించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Challenging conditions at Chennai International airport as cyclone Fengal makes landfall near Puducherry and is likely to cross the Tamil Nadu coasts in the next three to four hours.
The cyclonic storm brought heavy rains in the coastal districts, inundating houses and… pic.twitter.com/1AUohfWfB9
— Breaking Aviation News & Videos (@aviationbrk) November 30, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

